: విజయవాడలో వెలుగు చూసిన అగ్రిగోల్డ్ తరహా మోసం... సంస్థ కార్యాలయంపై బాధితుల దాడి!


ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో అగ్రిగోల్డ్ తరహా మోసం మరొకటి వెలుగుచూసింది. అధిక వడ్డీ ఇస్తాం, ప్లాట్లు ఇస్తాం అంటూ ఆశపెట్టి వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన పెరల్స్ ఆగ్రోటెక్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు విజయవాడలోని సదరు సంస్థ కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధిక వడ్డీ ఆశ చూపి, తాము రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బులను కాజేశారంటూ బాధితులు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News