: నిధులు లేకుండానే కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు: బీజేపీ నేత లక్ష్మణ్
నిధులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటిస్తోందని బీజేపీ నేత లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కరవు పరిస్థితిపై ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చుందంటూ ఆయన విమర్శించారు. తెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నా చర్యలు చేపట్టడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.