: అక్కడ కాదు... ముందు దేశంలో ఉన్న మసీదును సందర్శించాలి: మోదీకి ఏఐఎంపీఎల్బీ సూచన


యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రధాని యూఏఈలోని మసీదును సందర్శించడం కంటే ముందు భారత్ లో ఉన్న ఏ మసీదునైనా సందర్శించి ఉండాల్సిందని సూచించింది. ఏఐఎంపీఎల్బీ వర్కింగ్ జనరల్ సెక్రటరీ మౌలానా మహ్మద్ వాలి రెహ్మానీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వేరే దేశంలో ఉన్న మసీదుకు వెళ్లేముందు, దేశంలో ఉన్న ఏదో ఒక మసీదుకు వెళితే బాగుండేది అని అన్నారు. కేంద్రంలో సర్కారు మారిన తర్వాత ఓ మతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశంలోని ముస్లింలు ఇతర వర్గాలతో పోల్చితే ఆర్థికపరంగానూ, విద్య పరంగానూ వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ స్పష్టంగా చెప్పిందని, వారి అభ్యున్నతి కోసం ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కాగా, ప్రధాని మోదీ అబుదాబిలో పర్యటించిన సందర్భంగా అక్కడి విఖ్యాత షేక్ జాయేద్ మహా మసీదును సందర్శించారు. ఈ మసీదు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మసీదుగా పేరుగాంచింది. యూఏఈలో ఇదే పెద్దది. ఇస్లామిక్ ప్రపంచంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఈ మసీదును నిర్మించారు

  • Loading...

More Telugu News