: ప్రధానితో చంద్రబాబు అపాయింట్ మెంట్ ఖరారు


ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ ఖరారైంది. ఈ నెల 20 సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో ప్రధానితో బాబు భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధాన హామీ ప్రత్యేక హోదా, తదితర అంశాలపై వారిద్దరూ చర్చించనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇటీవల వెల్లువెత్తిన డిమాండ్ల నేపథ్యంలో కొన్ని రోజుల కిందటే మోదీని కలవాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే ఆగస్టు 15 తరువాత తనను కలవాలని ప్రధాని చెప్పినట్టు అప్పుడే సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో మోడీని కలిసేందుకు అపాయింట్ మెంట్ ఖరారైంది.

  • Loading...

More Telugu News