: బంగారం దిగుమతి విలువను పెంచిన కేంద్రం


దిగుమతి చేసుకునే బంగారం విలువను కేంద్రం 10 గ్రాములకు 354 డాలర్ల నుంచి 363 డాలర్లకు (సుమారు రూ. 23,010 నుంచి సుమారు రూ. 23,595) సవరించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సంకేతాలు, మార్కెట్ సరళిని అనుసరించి ఈ సవరణ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో కిలో వెండి విలువను 498 డాలర్ల నుంచి 499 డాలర్లకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారాన్ని ఎవరైనా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని తీసుకొస్తే ఈ విలువ ఆధారంగా సుంకాలను చెల్లించాల్సి వుంటుంది. కాగా, నేటి ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్సు బంగారం ధర 1,116.70 డాలర్లకు చేరింది. ఇక ఢిల్లీలో బంగారం ధర పది గ్రాములకు రూ. 26,200కు చేరింది.

  • Loading...

More Telugu News