: పట్టిసీమ నిర్మించడం జగన్ కు ఇష్టం లేదు: దేవినేని


రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం జగన్ కు ఎంతమాత్రం ఇష్టం లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. అందుకే, పట్టిసీమను అడ్డుకోవడానికి జగన్ అనుక్షణం ప్రయత్నిస్తున్నారని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ కు జగన్ లేఖ ఎందుకు రాశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ని ఇబ్బందులు తలెత్తినా హంద్రీనీవా పనులను పూర్తి చేస్తామని చెప్పారు. రైతు సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమానికి మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News