: ఇళయరాజా పూర్తిగా కోలుకున్నారు: దర్శకుడు వెంకట్ ప్రభు
కడుపునొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పూర్తిగా కోలుకున్నారని దర్శకుడు, నటుడు వెంకట్ ప్రభు తెలిపారు. ఆసుపత్రి నుంచి ఆయన ఈ రోజు డిశ్చార్జ్ అవుతారని ట్విట్టర్ లో చెప్పారు. "ఇళయరాజా ఆసుపత్రిలో చేరారని తెలియగానే అభిమానులు, సన్నిహితులు కంగారు పడ్డారు. ఇప్పుడాయన పూర్తిగా కోలుకున్నారు. కులాసాగా ఉన్నారు. జనరల్ చెకప్, కొన్ని పరీక్షల కోసమే ఆసుపత్రిలో చేరారు. ఈరోజే ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తారు" అని వెంకట్ ట్వీట్ చేశారు. కాగా, ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్టు నిన్న వార్తలొచ్చిన సంగతి విదితమే!