: పవన్ కల్యాణ్ ను ఒప్పిస్తాం: గాలి


రాజధాని నిర్మాణానికి సంబంధించి చేస్తున్న భూసేకరణపై జనసేన అధినేత, ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతుండటం తెలిసిందే. రైతుల సమ్మతితోనే వారి భూములను సేకరించాలని ఆయన అంటున్నారు. ఈ క్రమంలో, టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ భూసేకరణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై పవన్ కల్యాణ్ ను ఒప్పిస్తామని చెప్పారు. మరోవైపు వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఆయన మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పోలీసులను తాను నియంత్రిస్తున్నానంటూ రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వైకాపా నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని... ఈ క్రమంలో, పోలీసులు తమ కర్తవ్యాన్ని కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నారని అన్నారు. నగరి మున్సిపల్ కమిషనర్ ను మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త కించపరిచేలా మాట్లాడారని... అందువల్లే ఛైర్ పర్సన్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. రెచ్చగొట్టేలా మాట్లాడటాన్ని రోజా మానుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ. 8 వేల కోట్ల నిధులను పొందామని తెలిపారు.

  • Loading...

More Telugu News