: రూ.640 కోట్ల నష్టపరిహారం విషయంలో నెస్లేకు నోటీసు
మ్యాగీ నూడుల్స్ వివాదం నేపథ్యంలో నెస్లే ఇండియా సంస్థకు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార సంఘం (నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్) నోటీసు ఇచ్చింది. రూ.640 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ కేంద్రం వేసిన పిటిషన్ ను విచారించిన కమిషన్ ఈ విధంగా స్పందించింది. తప్పుడు లేబుళ్లు, ప్రకటనలతో తప్పుదోవ పట్టించారని కేంద్రం తన పిటిషన్ లో పేర్కొంది.