: ఫేస్ బుక్ లో ఏ సీఎంకు లేనంత ఫాలోయింగ్ కేసీఆర్ కు ఉంది: కేటీఆర్


తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేశంలో ఏ ఇతర సీఎంకు లేనంత ఫాలోయింగ్ ఫేస్ బుక్ లో ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎఫ్ బీలో సీఎంను 2 లక్షల 75వేల మంది ఫాలో అవుతున్నారని తెలిపారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణా హోటల్ లో జరిగిన 'ఫేస్ బుక్ ఫర్ బిజినెస్' కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉందన్నారు. ఫేస్ బుక్ కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఫేస్ బుక్ ను వారధిగా వాడుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News