: సైనాకు ప్రధాని మోదీ అభినందనలు


ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం గెలుచుకున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు."ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ తో సైనా చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ సందర్భంగా సైనాకు శుభాకాంక్షలు. ఆమె సాధించిన విజయం స్పూర్తిదాయకం" అని ట్విట్టర్ లో పోస్టు చేశారు. జకార్తాలో నిన్న(ఆదివారం) జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో సైనా పరాజయం పాలైంది. దీంతో ఆమెకు రజత పతకానికి పరిమితమైంది.

  • Loading...

More Telugu News