: చిత్తూరు జిల్లాలో పోలీసులు బరితెగిస్తున్నారు: రోజా
చిత్తూరు జిల్లాలో పోలీసులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని... ఆయనకు సలాం కొడుతున్న పోలీసులు వైకాపా నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. నగరి మున్సిపల్ ఛైర్మన్ శాంతకుమారి భర్తను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ నేతల కుట్రలను తాము ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు.