: టీ-టీడీపీ నేత వంటేరు ప్రతాపరెడ్డిపై కేసు నమోదు
టీ-టీడీపీ నేత వంటేరు ప్రతాపరెడ్డిపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తప్పుడు అవినీతి ఆరోపణలు చేశారని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరీష్ రావుకు వందల ఎకరాల భూమి ఉందని, బెంగళూరులో కూడా అక్రమ ఆస్తులు ఉన్నాయని ప్రతాపరెడ్డి ఆరోపణలు చేశారని సత్యనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతాపరెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. అయితే, వాస్తవాల గురించి మాట్లాడితే తమపై అక్రమ కేసులు పెడతారా? అంటూ ప్రతాపరెడ్డి మండిపడ్డారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనే సత్తా తమకుందని అన్నారు.