: మోటారు వాహన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రవాణా శాఖ: నితిన్ గడ్కరీ
తాను నిర్వహిస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నుంచి రవాణా శాఖను వేరు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మోటారు వాహనాల సంబంధిత సమస్యలైన ఇంధన సాంకేతికత, ఉద్గారాల తగ్గింపు తదితరాల పరిష్కారానికి ప్రత్యేకంగా రవాణా శాఖను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దానికి ప్రత్యేక కార్యదర్శిని కూడా నియమిస్తామని నితిన్ ఢిల్లీలో చెప్పారు. త్వరలో దాని ప్రతిపాదనను కేబినెట్, ప్రధానమంత్రి ఆమోదం కోసం పంపుతామని వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే వాహనాల రిజిస్ట్రేషన్ 8.68 శాతం పెరిగిందని వివరించారు.