: అప్పట్లో నా వెనుక మరో నలుగురు నేతలుంటే రాష్ట్రంలో పెనుమార్పులు వచ్చుండేవి: నాగం


తెలంగాణ బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తన మనసులోని భావాలను ఓ తెలుగు మీడియా ఛానల్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం తెలంగాణను సాధించాలనే తపనతోనే ఆనాడు టీడీపీని వదిలి బీజేపీలో చేరానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ ఆహ్వానించడం వల్లే కాషాయ కండువా కప్పుకున్నానని చెప్పారు. ప్రస్తుతం బీజేపీతో తనకు ఎలాంటి సమస్యలు లేవని.... తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కూడా తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అయితే, తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోనని చెప్పారు. తెలంగాణ ఉన్నతి కోసమే 'తెలంగాణ బచావ్' సంస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. టీడీపీలోకి కాని, టీఆర్ఎస్ లోకి కాని వెళ్లే ఆలోచన తనకు లేదని అన్నారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ప్రజల అభ్యున్నతికి అనుగుణంగా సాగడం లేదని మండిపడ్డారు. తాను టీడీపీ వీడి వచ్చినప్పుడు తనతో పాటు కొంత మంది వచ్చారని... మరో నలుగురు తన వెంట వచ్చి ఉన్నట్టయితే తెలంగాణలో పెను మార్పులు సంభవించి ఉండేవని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ తనను ఆహ్వానించినప్పటికీ, తాను ఆ పార్టీలోకి చేరలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News