: జగన్ ను సీఎంగా చూడాలంటున్న వైకాపా నేత
వైకాపా అధినేత జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన కోరికని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను వ్యక్తిగత కారణాలతోనే వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే జగన్ సీఎం కావాల్సి వుందని అన్నారు. ఇకపై పార్టీలో సాధారణ కార్యకర్తగా పనిచేస్తానని, కోవూరు, గూడూరు నియోజకవర్గాల్లో వైకాపాను బలోపేతం చేయడమే లక్ష్యంగా జగన్ అడుగుజాడల్లో నడుస్తానని స్పష్టం చేశారు.