: బెంగళూరులో కాల్పుల కలకలం... ఆసుపత్రిలో హత్యా నిందితుడి హల్ చల్


బెంగళూరులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అక్కడి నిమాన్స్ ఆసుప్రతి ప్రాంగణంలోకి విశ్వనాథ్ అనే ఓ ఖైదీని చికిత్స నిమిత్తం పోలీసులు తీసుకొచ్చారు. ఓ హత్య కేసులో నిందితుడైన విశ్వనాథ్ ను తీసుకొస్తున్న పోలీసుల వద్ద నుంచి తుపాకీ లాక్కున్న నిందితుడు, 8 రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆందోళనకు లోనైన రోగులు, వైద్యులు, పోలీసులు, సందర్శకులు పరుగులు తీశారు. కాల్పుల కలకలం రేగడంతో ఆసుపత్రి ప్రాంగణంలో పెద్దఎత్తున బలగాలు మోహరించారు. కాగా, ఈ ఘటనలో నిందితుడు విశ్వనాథ్ ను వైద్యులు నిలువరించారు. తుపాకీలో ఉన్న మందుగుండు సామగ్రి అయిపోయిన కారణంగా కాల్పులు ఆపినట్టు సమాచారం. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. కాగా, విశ్వనాథ్ మానసిక రోగి అని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News