: చాలా మంది నన్ను మెంటలోడు అన్నారు!: ఉపేంద్ర
సినిమా రంగంలోకి వచ్చిన కొత్తల్లో తనను చాలా మంది మెంటలోడు అన్నారని కన్నడ సినీ నటుడు ఉపేంద్ర తెలిపాడు. 'ఉపేంద్ర 2' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, రేపన్నది ఎవరూ ఊహించలేరని అన్నాడు. రేపటిని ఇప్పుడే ఉహించగలిగితే మహానుభావులైపోతామని చెప్పాడు. భవిష్యత్ లో దర్శకుడిగా ఉంటానా? నటుడిగా కొనసాగుతానా? అన్నది తెలియదని, కాలం ఎటువైపుగా తీసుకెళ్తే అటే వెళ్తానని చెప్పాడు. తన తరువాతి సినిమా ఏంటనేది కూడా తాను చెప్పలేనని, అప్పటికి కథ నచ్చితే అది చేస్తానని, లేదా కొత్త ఆలోచన వచ్చి స్టోరీ రాయాలనిపిస్తే రాస్తానని, ప్లాన్ ప్రకారం ఏదీ జరగదని ఉపేంద్ర చెప్పాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది నటులు అంటే తనకు ఇష్టమని ఉపేంద్ర తెలిపాడు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ... ఇలా అందరూ ఇష్టమేనని ఉపేంద్ర చెప్పాడు. అందరూ గొప్ప నటులని తెలిపాడు.