: బీహార్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన రామ్ నాథ్ కోవింద్


రామ్ నాథ్ కోవింద్ బీహార్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇక్బాల్ అహ్మద్ అన్సారీ నూతన గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్ లోని రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో బీహార్ గవర్నర్ గా రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. దీంతో బీహార్ 36వ గవర్నర్ గా రామ్ నాథ్ కోవింద్ బాధ్యతలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News