: గుంటూరులో తెల్లవారుజామున కురిసింది చేపల వానేనా?


ఈ మధ్య కాలంలో ఆకాశం నుంచి చేపల వర్షాలు కురుస్తున్నాయంటూ పలు ప్రాంతాల్లో కలకలం రేగుతోంది. తాజాగా ఈ రోజు తెల్లవారు జామున గుంటూరు జిల్లా నగరం మండలం ఉయ్యూరువారి పాలెంలో వర్షం కురిసింది. 'ఇది కూడా చేపల వానే' అంటూ బాగా ప్రచారం జరగడంతో గ్రామస్తులు చేపలు పట్టుకునేందుకు పొలాలకు పరుగులు తీశారు. అయితే, కేవలం రెండు ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే చేపలు కనబడడం పలు అనుమానాలకు తావిస్తున్నప్పటికీ, ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి చెరువులు లేకపోవడం విశేషం. ఇక మరోపక్క పొలాలకు నీరందించే కాల్వలు అడుగంటి ఉన్నాయి. దీంతో ఈ చేపలు ఆకాశం నుంచే పడ్డాయంటూ స్థానికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News