: సింగిల్ సిట్టింగ్ లోనే 'శ్రీమంతుడు'ని ఎందుకు ఓకే చెప్పానంటే...!: సీక్రెట్ చెప్పిన మహేష్


కేవలం ఒక్కసారి మాత్రమే కథ విని 'శ్రీమంతుడు' చిత్రాన్ని ఎలా అంగీకరించారన్న ప్రశ్నకు ప్రిన్స్ మహేష్ బాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. "ఇందులో ఆలోచించడానికి ఏముందండీ, కథ సూపర్బ్, కొత్తగా, వినూత్నంగా అనిపించింది. ఓ సందేశాత్మక కథను, ఇంత కమర్షియల్ గా తీయవచ్చా అనిపించింది. అందుకే వెంటనే ఒప్పేసుకున్నాను. ఈ సినిమా తీస్తున్నప్పుడు మా బావ జయదేవ్ వచ్చి బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. వెంటనే ఒప్పుకున్నాను. కానీ ఆ విషయాన్ని ముందే చెబితే శ్రీమంతుడు ప్రమోషన్ కోసం దత్తత తీసుకున్నారని అంటారని విషయం చెప్పలేదు. త్వరలోనే దత్తత తీసుకుంటా" అని అన్నారు. శ్రీమంతుడు చిత్రం విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మీడియా ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

  • Loading...

More Telugu News