: 15 ఏళ్ల కెరీర్ లో ఇదే అత్యుత్తమ చిత్రం: మహేష్ బాబు


తన 17 సంవత్సరాల సినీ చరిత్రలో అత్యుత్తమ చిత్రంగా 'శ్రీమంతుడు' నిలిచిందని ప్రిన్స్ మహేష్ బాబు వ్యాఖ్యానించాడు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో జరిగిన చిత్రం సక్సెస్ మీట్ లో చిత్ర బృందంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, ఆగస్టు 7 తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజని, తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిందని వివరించాడు. ఒక మంచి సినిమా చేసేందుకు జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, శ్రుతిహాసన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇతర టెక్నీషియన్లు ఎంతో సహకరించారని అన్నాడు. ఈ చిత్రాన్ని చూసి యువత స్పందించి, సొంత ఊర్లకు ఏదైనా చేద్దామని భావిస్తున్నారని, అది తమ టీంకు ఎంతో గర్వకారణమని చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే, తమకు వస్తున్న ప్రశంసలు అద్భుతంగా అనిపిస్తున్నాయని, మరో నాలుగైదు వారాల తరువాతే సినిమా ఎటువంటి ప్రభావం చూపించిందన్న విషయంపై పూర్తి అవగాహనకు వస్తామని అన్నాడు.

  • Loading...

More Telugu News