: 'సహారా' హోటల్స్ కొనుగోలు చేస్తామని సుప్రీంను ఆశ్రయించిన రెండు కంపెనీలు
సహారా గ్రూప్ అధీనంలో లండన్ లో ఉన్న గ్రోస్ వెనార్ హౌస్ హోటల్, న్యూయార్క్ లోని న్యూయార్క్ ప్లాజాలను తాము కొనుగోలు చేస్తామని రెండు ప్రైవేటు కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ రెండు హోటళ్లనూ తమకు విక్రయిస్తే 63 కోట్ల పౌండ్లు (సుమారు రూ. 6,370 కోట్లు) చెల్లిస్తామన్న ఆఫర్ కూడా ఇస్తూ, బ్రిటన్ కేంద్రంగా నడుస్తున్న సంస్థ ఒకటి పిటిషన్ దాఖలు చేసింది. మరో నిర్మాణ రంగ సంస్థ కేన్ కాపిటల్ పార్ట్ నర్స్ లిమిటెడ్ కూడా ఇదే తరహా పిటిషన్ తో కోర్టును ఆశ్రయించింది. వీటిని విచారణకు స్వీకరించిన టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం నాడు విచారించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కాగా, కోర్టుకు డబ్బు డిపాజిట్ చేసే వరకూ సుబ్రతా రాయ్ కి బెయిలిచ్చే సమస్యే లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.