: ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో గోదావరికి జలకళ


గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీరు పెరుగుతోంది. శనివారం రాత్రి 29 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం ఈ ఉదయానికి 35 అడుగులకు చేరింది. ప్రతి గంటకూ రెండు నుంచి మూడు అంగుళాల మేరకు నీటి ప్రవాహం పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలింకా పడుతూ ఉండటంతో, మరో 24 గంటల పాటు నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంటుందని సీడబ్ల్యూసీ అధికారులు వివరించారు. వరద ఉద్ధృతి పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News