: యువతిని రక్షించబోయిన సైనికుడిని కొట్టి చంపిన ఈవ్ టీజర్లు


ఈవ్ టీజర్ల బారి నుంచి యువతిని రక్షించబోయిన ఆర్మీ జవానును తీవ్రంగా కొట్టి హతమార్చిన ఘటన మీరట్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 416 ఇంజనీరింగ్ బ్రిగేడ్ కు చెందిన లాన్స్ నాయక్ వేద్ మిత్ర చౌధురి (35), హర్ దేవ్ నగర్ ప్రాంతం నుంచి పాలు తెచ్చుకునేందుకు వెళ్లాడు. పాల దుకాణంలో యజమాని కుమార్తె కూర్చుని ఉండగా, ఓ యువకుడు వేధిస్తుండటాన్ని చూశాడు. అతడిని వారించగా, మాటా మటా పెరిగింది. బాలికను వేధిస్తున్న యువకుడు ఆకాశ్ తన స్నేహితులకు ఫోన్ చేయడంతో వారు కర్రలతో వచ్చారు. వచ్చీరాగానే సైనికుడిపై దాడికి దిగారు. కర్రలతో చావబాదారు. తీవ్ర గాయాలపాలైన వేద్ మిత్రను సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. నిందితుడు ఆకాశ్ తో పాటు, అతని స్నేహితులు సంజూ, రితీష్ లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News