: ఓడలు బళ్లయితే ఇలానే ఉంటుంది!
అదృష్టం తలకిందులైతే ఇలాగే ఉంటుంది. ఓడలు బళ్లు కావడమన్నా కూడా ఇదేనేమో! తన చేతులతో స్వయంగా ఓ జైలు నిర్మాణానికి పునాదిరాయి వేసిన ఓ గోవా మంత్రి నేడు అదే జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. గోవాలో ప్రజా పనుల శాఖ మంత్రి చర్చిల్ అలెమావోను, లూయిస్ బర్గర్ లంచం కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో భాగంగా ఏడు రోజులు క్రైమ్ బ్రాంచ్ లాకప్ లో గడిపిన ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, కొత్తగా నిర్మించిన కోల్వాలే జైలుకు తరలించారు. ఈ జైలుకై 2010లో పునాదిరాయి వేసింది కూడా ఆయనే. ఈ సంవత్సరం మే 30న జైలు ప్రారంభం కాగా, మొట్టమొదట వచ్చిన 'వీవీఐపీ' కూడా ఇతనేనట. అన్నట్టు ఈ జైల్లో సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నాయని అలెమావో వ్యాఖ్యానించారట.