: అర్ధరాత్రి పాతబస్తీలో బీభత్సం, 23 వాహనాలు ఆహుతి
హైదరాబాద్ నగరంలో గత అర్ధరాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. పాతబస్తీ పరిధిలోని అల్లావుద్దీన్ కోఠి ఏరియాలో 23 వాహనాలను దగ్ధం చేశారు. రోడ్లపై పార్క్ చేసివున్న వాహనాలే లక్ష్యంగా హల్ చల్ చేశారు. నిమిషాల వ్యవధిలో వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. వాహనాలను తగులబెట్టిన దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. కేసు నమోదు చేశామని, సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు.