: భిన్నత్వంలో ఏకత్వం పట్ల భారతీయుులు గర్వపడాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూరత్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పతాకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం పట్ల భారతీయులు గర్వపడాలని సూచించారు. మన జాతీయ పతాకంలో మూడు రంగులు ఉన్నాయని, మధ్యలో ధర్మచక్రం ఉంటుందని, మనదేశ మతం కోసమే మనందరం జీవించాలని ఆ చక్రం చెబుతుందని అన్నారు. జెండా పైభాగంలో ఉండే కాషాయ రంగు త్యాగానికి, విశ్వసనీయతకు, విజ్ఞానానికి ప్రతిరూపమని తెలిపారు. మతం ద్వారానే ప్రజలు పురోగతితో అనుసంధానమవుతారని, మతమంటే కేవలం ఆరాధించడమే కాదని, ఆరాధన మతంలో ఓ చిన్న భాగం మాత్రమేనని వివరించారు. హిందూ మతంగా పేర్కొనే ఈ మానవీయ మతంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని, ఈ వైవిధ్యం పట్ల గర్వించాలని పిలుపునిచ్చారు.