: చంద్రబాబును భగీరథుడితో పోల్చిన మంత్రి మాణిక్యాలరావు
సీఎం చంద్రబాబు అపర భగీరథుడు అని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆకాశానికెత్తేశారు. చంద్రబాబు పట్టుదల కారణంగా పట్టిసీమ ప్రాజెక్టు అతి తక్కువ సమయంలోనే అందుబాటులోకి వస్తోందని అన్నారు. నదుల అనుసంధానం కార్యక్రమాన్ని భుజాలకెత్తుకున్న చంద్రబాబు మహోన్నతుడని కీర్తించారు. పట్టిసీమతో రాయలసీమ కళకళలాడుతుందని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.