: రోజర్స్ కప్ సెమీస్ లో సానియా జోడీ


ప్రతిష్ఠాత్మక 'రాజీవ్ ఖేల్ రత్న' పురస్కారానికి ఎంపికైన టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా జోరు కనబరుస్తోంది. కెనడాలో జరుగుతున్న రోజర్స్ కప్ లో మహిళల డబుల్స్ విభాగంలో సానియా, మార్టినా హింగిస్ జోడీ సెమీస్ లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ 6-4, 6-2తో తైపే జంట హావో చింగ్ చాన్, యుంగ్ జాన్ చాన్ పై వరుస సెట్లలో విజయం సాధించింది. సెమీస్ లో సానియా జోడీ కరోలిన్ గార్సియా, కేథరినా స్రెబోత్నిక్ జోడీతో తలపడనుంది.

  • Loading...

More Telugu News