: వీళ్లకూ 'ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్' కావాలట!


'ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్' విధానం అమలు చేయాలంటూ మాజీ సైనికులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి బాటలోనే రైల్వే ఉద్యోగులు కూడా 'ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్' డిమాండ్ చేస్తున్నారు. తమను విస్మరింపజాలరని, రక్షణ రంగ సిబ్బంది లాగానే, తాము కూడా జాతికి తమ సేవలను అంకితం చేశామని అంటున్నారు. రైల్వే ఉద్యోగులకు ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ అంశాన్ని ఏడో వేతన సంఘం కూడా చర్చించిందని, మరోసారి దీన్ని లేవనెత్తుతామని ఆలిండియా రైల్వే ఉద్యోగుల సమాఖ్య జనరల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా తెలిపారు. రైల్వే ఉద్యోగులు అంకితభావంతో సేవలందిస్తున్నారని, రైల్వే శాఖ దేశానికి జీవనరేఖ వంటిదని పేర్కొన్నారు. రక్షణ దళాల సిబ్బందికి 'ఒకే ర్యాంకు...' విధానాన్ని అమలు చేసినట్టయితే, తమకు కూడా ఆ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఏదైనా చెబుతారని ఆశించామని, కానీ, ఆయన ఏమీ చెప్పకుండా నిరాశపరిచారని మిశ్రా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News