: మేమేమీ నిధులు అడగడం లేదు... ప్రత్యేక హోదా అడుగుతున్నాం: నితీశ్ కుమార్


బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని మరోసారి డిమాండ్ చేశారు. తామేమీ నిధులు కోరడం లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వస్తే పన్ను మినహాయింపులు వర్తిస్తాయని, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తాయని, తద్వారా, యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నితీశ్ డిమాండ్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో... ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని, ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయని కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News