: స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా తీరు మార్చుకోని పాకిస్థాన్


భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా పాకిస్థాన్ మనపై విషం గక్కింది. చర్చల ద్వారా భారత్ తో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని ఓ వైపు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెబుతుంటే... అదే సమయంలో ఆ దేశానికి చెందిన సైన్యం మాత్రం కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. ఈ డబుల్ గేమ్ కు అద్దంపడుతూ, ఈ ఉదయం అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న భారత మిలటరీ స్థావరాలపై మోర్టార్లు, అత్యాధునిక ఆయుధాలతో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. అయితే, పాక్ కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని కల్నల్ మనీష్ మెహతా తెలిపారు.

  • Loading...

More Telugu News