: కేసీఆర్ తో భేటీ అయిన జీహెచ్ఎంసీ కమిషనర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా, హైదరాబాదులో చెత్త సేకరించడానికి కొనుగోలు చేయనున్న ట్రాలీ మోడళ్లను ముఖ్యమంత్రికి సోమేష్ కుమార్ చూపించారు. మోడల్స్ ను పరిశీలించిన కేసీఆర్ వాటికి ఆమోదం తెలిపారు. పరిశుభ్రతకు, పచ్చదనానికి గుర్తుగా వాహనాలు ఆకుపచ్చ రంగులో ఉండాలని సూచించారు. మరోవైపు, బస్తీల్లో చెత్త సేకరించడానికి 1500 ట్రైసైకిళ్లు కొనాలని కేసీఆర్ ఆదేశించారు.