: నాకు మాటలు రావడం లేదు!: విజయంపై లంక సారథి మాథ్యూస్
విజయంపై ధీమాతో నాలుగో రోజు ఆటలో బరిలో దిగిన టీమిండియాకు షాక్ ఇచ్చింది శ్రీలంక జట్టు. ఓటమి తప్పదని లంక అభిమానులు కూడా నిర్ధారించుకున్న సమయంలో స్పిన్నర్ రంగన హెరాత్ మాయాజాలంతో ఆతిథ్య జట్టు జయభేరి మోగించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం లంక సారథి ఏంజెలో మాథ్యూస్ మాట్లాడుతూ... "ఆట ఏం మలుపు తిరిగింది! నాకు మాటలు రావడం లేదు. నిజంగా గొప్ప ప్రయత్నం చేశాం. తొలి ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శన తర్వాత పుంజుకున్నాం. ముఖ్యంగా, దినేశ్ చాందిమల్ అవుట్ స్టాండింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒంటి చేత్తో గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. మా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉండడం లాభించింది. సరైన ప్రదేశాల్లో బంతులు విసరడం ద్వారా వికెట్లు చేజిక్కించుకున్నారు" అని వివరించాడు.