: ఓటమికి ఏ ఒక్కరినో నిందించలేం... వైఫల్యం అందరిదీ: కోహ్లీ
గాలే టెస్టులో దారుణ పరాభవం చవిచూసిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్వేదం ప్రదర్శించాడు. టెస్టు క్రికెట్ అంటే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించాడు. కేవలం ఒక్క బ్యాడ్ సెషన్ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డాడు. లంక సెకండ్ ఇన్నింగ్స్ లో తొలి ఐదు వికెట్లను పడగొట్టిన తర్వాత పరిస్థితులను నియంత్రణలోకి తెచ్చుకోలేకపోయామని కోహ్లీ అంగీకరించాడు. రంగన హెరాత్ అద్భుతమైన బౌలర్ అని, ఒత్తిడిలోనూ టీమిండియా బ్యాట్స్ మెన్ ఆటకట్టించాడని పేర్కొన్నాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ ను గెలవడం మామూలు విషయం కాదని, ఆ ఘనత ఏంజెలో మాథ్యూస్ కు, అతని జట్టుకు చెందుతుందని అన్నాడు. తమ ఓటమికి ఏ ఒక్కరినో నిందించలేమని, ఈ వైఫల్యం అందరిదీ అని స్పష్టం చేశాడు.