: ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన రోజు కాదు: రాహుల్ గాంధీ
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం, ప్రధాని ఎర్రకోట ప్రసంగంపై స్పందించాలని మీడియా రాహుల్ గాంధీని కోరింది. అందుకాయన బదులిస్తూ... ఇది రాజకీయాల గురించి మాట్లాడాల్సిన రోజు కాదని, రేపు మాట్లాడతామని అన్నారు. సోనియా గాంధీ కూడా ఈ విషయమై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మీడియా ప్రతినిధులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, అంతటితో సరిపెట్టారు.