: బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ వస్తోంది... మంగళవారం ప్రకటించనున్న మోదీ
అసెంబ్లీ ఎన్నికలు బీహార్ కు వరంగా మారాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని, లేని పక్షంలో భారీ ప్రత్యేక ప్యాకేజీ అయినా ప్రకటించాలని ఆ రాష్ట్ర వాసులు గొంతెత్తి మొత్తుకుంటున్నారు. అయినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం... అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం బీహార్ కు మాత్రం అడగకున్నా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేందుకు సిద్ధమైంది. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు బీహార్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, మంగళవారం మరోమారు అక్కడికి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత అధికార వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.