: అర్ధరాత్రి పూట మనకు స్వాతంత్ర్యం ఎందుకు వచ్చిందంటే...!


మన దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి వచ్చింది. ఈ అర్ధరాత్రి కథ ఏంటో ఒకసారి చూద్దాం. అనాటి బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ అధికార బదిలీ కోసం ఆగస్ట్ 15వ తేదీని ప్రకటించారు. దీంతో, జ్యోతిష్కులు, హిందూ మత ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి కారణం ఆగస్టు 15వ తేదీ మంచి రోజు కాకపోవడమే. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ లకు ఇలాంటి వాటిపై పెద్దగా నమ్మకం లేకపోయినప్పటికీ... అందరి మనోభావాలకు అనుగుణంగా వెళ్లాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని మౌంట్ బాటన్ కు తెలిపారు. ఈ క్రమంలో, చివరకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. 15వ తేదీ మొదలయ్యే ఘడియల్లో... అంటే, 14వ తేదీ అర్ధరాత్రి అధికార బదిలీ జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో, 14వ తేదీ రాత్రి 11 గంటల నుంచి రాజ్యాంగ సభను నిర్వహించారు. సరిగ్గా 12 గంటలకు అధికార బదలాయింపు జరిగింది. దీంతో, మనకు అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చినట్టు అయింది.

  • Loading...

More Telugu News