: కూకట్ పల్లి ‘స్వాతంత్ర్య’ వేడుకల్లో ‘శ్రీమంతుడు’ టీం...సందడి చేసిన ప్రిన్స్ మహేశ్ బాబు


69వ భారత స్వాతంత్ర్య వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. తాజాగా కూకట్ పల్లిలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘శ్రీమంతుడు’ టీం సందడి చేసింది. చిత్ర దర్శకుడు కొరటాల శివతో పాటు చిత్ర హీరో, టాలీవుడ్ అగ్ర నటుడు ప్రిన్స్ మహేశ్ బాబు జాతీయ జెండా చేతబట్టి తమ దేశభక్తి చాటుకున్నారు. మహేశ్ బాబు పాలుపంచుకున్న నేపథ్యంలో వేడుకల్లో పాల్గొన్న యువత కేరింతలు కొట్టింది.

  • Loading...

More Telugu News