: సైనికులకు సలాం... మిలిటరీ యూనీఫాంలో ధోనీ శాల్యూట్ సెల్ఫీ!
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశాన్ని, దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల సాహసాలపై సెలబ్రిటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘శాల్యూట్ సెల్ఫీ’ పేరిట ట్విట్టర్ తెరపైకి వచ్చిన పోస్టింగ్ లకు సినీ నటులే కాక క్రీడాకారులు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ విభాగం కింద బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పాటు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా తమ సెల్ఫీలను పోస్ట్ చేశారు. తాజాగా టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా స్పందించాడు. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకు పొందిన ధోనీ, మిలిటరీ యూనిఫాంలో సైనికులకు శాల్యూట్ చేస్తున్న ఫోటోను తన శాల్యూట్ సెల్ఫీగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.