: గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి భయపెట్టే వాస్తవాలు


గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రమాదం భూమండలానికి పొంచి ఉన్నదని, భూమండలం యావత్తూ వేడెక్కుతోందని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పర్యావరణ వేత్తలు ఎంతగా మొత్తుకుంటున్నా సహజంగానే మన చెవికెక్కదు. అయితే ఈ భయాలను ధ్రువీకరించే వాస్తవాలు శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడవుతున్నాయి. గత ఇరవై శతాబ్దాల్లో భూమండలం మీద నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. 20వ శతాబ్దమే.. అత్యంత ఉష్ణం కలిగినదిగా తేలుతోందిట.

ఇరవయ్యో శతాబ్దం అత్యంత వేడైనదని తాజా అధ్యయనం చెప్తోంది. గత 1400 ఏళ్లలో 1971-2000 మధ్య నమోదైనవే భారీ ఉష్ణోగ్రతలని పేర్కొంది. ఇందుకు భూతాపమే కారణమట. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన న్యూసౌత్‌వేల్స్‌ వర్సిటీకి చెందిన స్టీఫెన్‌ ఫిలిప్స్‌ ఈ విషయం తెలిపారు. అయితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల విషయంలోనూ తేడాలున్నాయిట.

  • Loading...

More Telugu News