: కబడ్డీ ద్వారానే ఆర్ఎస్ఎస్ లోకి వచ్చాను: వెంకయ్యనాయుడు
ఈ రోజు (శుక్రవారం) ముంబైలో జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ పోటీలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కబడ్డీ ద్వారానే ఆర్ఎస్ఎస్ లో చేరానని, దాంతో తన జీవితమే మారిపోయిందని తెలిపారు. పాఠశాల రోజుల్లో కబడ్డీ అంటే ఎంతో ఇష్టపడేవాడినని చెప్పారు. ప్రొ కబడ్డీ వంటి లీగ్ పోటీల ద్వారా కబడ్డీకి ఎంతో ప్రాముఖ్యత కల్పించడం హర్షణీయమని అన్నారు. ఈ లీగ్ లో సినిమా తారలు కూడా భాగస్వాములు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.