: పాక్ దళాలకు ఏ రోజైనా ఒక్కటే!


జమ్మూకాశ్మీర్లో నియంత్రణ రేఖ పొడవునా పాకిస్థాన్ దళాల కాల్పులు కొనసాగుతున్నాయి. శుక్రవారం పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం అయినా గానీ, వారి బలగాల తుపాకులు మాత్రం గర్జిస్తూనే ఉన్నాయి. పూంచ్ జిల్లాలో భారత సైన్యం పోస్టులను లక్ష్యంగా చేసుకున్న పాక్ బలగాలు మోర్టారు గుళ్ల వర్షం కురిపించాయి. బాలాకోట్ ప్రాంతంలో ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్, తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిపారు. గురువారం రాత్రి నుంచే పాక్ దళాలు తుపాకులకు పనిచెప్పాయి. తెల్లవారుజామున కాస్త విశ్రాంతినిచ్చి, మళ్లీ తమ ప్రతాపం చూపారు పాక్ రేంజర్లు. అయితే, పాక్ దళాల కవ్వింపులకు భారత్ బలగాలు దీటుగా జవాబిచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం దాయాది దేశానికి ఇదేమీ కొత్తకాదు. ఏడాది పొడవునా సరిహద్దుల్లో ఎక్కడో ఓ చోట కాల్పుల మోత మోగించే పాక్ రేంజర్లు, ఇండిపెండెన్స్ డే నాడు కూడా విశ్రాంతి తీసుకోలేదు. భారత బలగాల దృష్టి మరల్చడమే తమ పని అన్నట్టు, ఏ రోజైనా తమకు ఒక్కటే అన్నట్టు వారి తీరు చెబుతోంది.

  • Loading...

More Telugu News