: ఏపీ ఎక్స్ ప్రెస్... ఇదేం టైం, అసలు బాగాలేదు!
రెండు రోజుల క్రితం ఆర్భాటంగా ప్రారంభమైన ఏపీ ఎక్స్ ప్రెస్ పై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఈ రైలు ప్రయాణ సమయాలు ప్రజలకు ఎంతమాత్రమూ అనుకూలంగా లేవన్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రైలు విశాఖ నుంచి ఉదయం బయలుదేరి మరుసటి రోజు రాత్రికి ఢిల్లీ చేరుతుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రెండు పగళ్లను రైల్లో గడపాల్సి వుంటుంది. దీనికితోడు, రాత్రిపూట ఢిల్లీకి చేరి తెల్లారేవరకూ బస ఏర్పాట్లు చూసుకోవాల్సి వుంటుంది. దీనివల్ల రెండు రోజుల సమయం వృథా అవుతోందని ప్రయాణికులు అంటున్నారు. విశాఖలో రాత్రిపూట బయలుదేరి, ఢిల్లీకి ఉదయం చేరేలా రైలు వేళలను సవరించాలని అందరూ కోరుతున్నారు. కాగా, ఈ రైలులో వచ్చే నాలుగు నెలల కాలానికి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు పుష్కలంగా బెర్తులు లభిస్తున్నాయి.