: సంపాదనలో వరుసగా 11వ సారి ‘టాప్’ లేపిన షరపోవా
అందం, ఆటలోనే కాదండోయ్... ధనార్జనలోనూ రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా రికార్డులు నమోదు చేస్తోంది. అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా ఆథ్లెట్లలో వరుసగా 11వ సారి కూడా ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా జాబితాలో రూ.193 కోట్ల ధనార్జనతో షరపోవా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇక మహిళల సింగిల్స్ ర్యాకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ రూ.160 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.