: కోహ్లీపై గంగూలీ ప్రశంసల జల్లు... టెస్టు కెప్టెన్ లో మారడోనా కనిపిస్తున్నాడని వ్యాఖ్య!


టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోమారు ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీని చూస్తుంటే, తనకు ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనానే గుర్తుకు వస్తున్నాడని అతడు వ్యాఖ్యానించాడు. ‘‘నా అభిమాన ఆటగాళ్లలో మారడోనా ఒకడు. అతడు ఫుట్ బాల్ ను ఆరాధిస్తాడు. ఎప్పుడు చూసినా సాకర్ తో మమేకమై ఉంటాడు. కోహ్లీలో కూడా అలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. అతడి బాడీ లాంగ్వేజ్ నాకిష్టం. కోహ్లీకి నేనే పెద్ద అభిమానిని’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News