: టీ ఏసీబీ విచారణకు హాజరు కాని నారా లోకేశ్ డ్రైవర్... రెండో నోటీసుకు రంగం సిద్ధం


ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకావాలన్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (టీ ఏసీబీ) నోటీసులకు టీడీపీ యువనేత, ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డి స్పందించలేదు. నిన్న ఉదయం 10.30 గంటలకు ఏసీబీ కార్యాలయానికి రావాల్సిన అతడు సాయంత్రం దాకా ఏసీబీ అధికారులు ఎదురుచూసినా అక్కడికి రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోమారు నోటీసు జారీ చేసే దిశగా టీ ఏసీబీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రెండో నోటీసుకు కూడా ఆయన స్పందించకుంటే ఆ తదుపరి చర్యలకు కూడా ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News