: కూకట్ పల్లి జేఎన్టీయూ బయట ర్యాగింగ్...పోలీసులకు దొరికిపోయిన సీనియర్లు


ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. దీంతో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ర్యాగింగ్ చేస్తే విద్యాలయాల నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడమంటూ కళాశాలలు హెచ్చరిస్తున్నాయి. అయినా ర్యాగింగ్ భూతం ఆగడం లేదు. హైదరాబాదులోని కూకట్ పల్లిలో జేఎన్టీయూ గేట్ వద్ద గల బస్టాప్ లో ఇద్దరు సీనియర్లు జూనియర్ అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. యువతులను వేధిస్తుండగా పట్టుకున్న పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు.

  • Loading...

More Telugu News