: వినూత్న రీతిలో భారత కు కృతజ్ఞతలు తెలిపిన ఆఫ్ఘన్లు
ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు భారత్ కు వినూత్నరీతిలో కృతజ్ఞత వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లో సల్మా డ్యాం ను భారత్ నిర్మిస్తోంది. ఈ డ్యాం నిర్మాణం త్వరలోనే పూర్తి కానుంది. డ్యాం పనులు ముగింపు దశకు చేరుకుంటుండడంతో రిజర్వాయర్ లో నీళ్లు కూడా చేరుకుంటున్నాయి. విద్యుదుత్పత్తి, సాగునీటి సరఫరా కోసం నిర్మితమవుతున్న సల్మా డ్యాం పనులను భారత్ ప్రభుత్వం 2006లో ప్రారంభించింది. ఈ డ్యాం నిర్మాణానికి భారత్ 300 మిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. డ్యాం నిర్మాణం ముగుస్తుండడంతో ఆఫ్ఘన్ ప్రజలు భారత్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో భారత్ ను ప్రశంసల్లో ముంచెత్తిన ఆఫ్ఘన్లు, ఆఫ్ఘనిస్థాన్ లో భారత దౌత్య కార్యాలయం ఎదుట ఆఫ్ఘన్ జాతీయ జెండతో పాటు, వంద మీటర్ల భారత జాతీయ జెండాను ప్రదర్శించి కృతజ్ఞతలు తెలిపారు.